శుభోదయం 🙏🙏 విజయ గోలి
కోలాట మాడెనమ్మా…కొంటె కృష్ణుడు .
నెమలి ఈకలను కొప్పున తురిమి ..
దండ కడియములు ధగ ధగ మెరియగా
మెడలో దండలు తాధిమి తకధిమి నాట్యం చేయగా
కోలాట మాడెనమ్మా …కొంటె కృష్ణుడు
పట్టు దట్టిని గట్టిగ చుట్టి …
బంగరు మొలత్రాడు మిల మిలలాడగా ..
కాలి గజ్జలు ఘల్లున మ్రోగ..
కోలాట మాడెనమ్మా ..కొంటె కృష్ణుడు
రేపల్లె వాడలోన ..ఆబాలగోపాలురతో ..
కోరి ..కోరి.. కోలాటమాడెనమ్మా ..కొంటె కృష్ణుడు ..