శుభోదయం 🙏🙏 విజయ గోలి
జాడ తెలుపవే రామచిలుకా..
మదిని దోచిన నందనందనుఁడెచట దాగెనో ..
.పొన్నపొగడల పొదల మాటున వెదికినాను.
వాడవాడల అడిగినాను వేణుగానము ఎక్కడంటూ..
మౌనమేలనే ..మాటలాడవే…వన్నెగాని ఊసు చెప్పవే..
కొలను దాపున గున్నమావి గుబురులోనా..
దాగేనేమో చూడరాదా….కన్నె వలువలు దోచగా వేచినాడేమో
.
చల్లలమ్మే..పల్లె భామల దారి కాచి నక్కినాడేమో..
జాడ చెప్పవే రామచిలుకా..జాణతనమేలా