మిత్రులకు శుభోదయం 🙏విజయ గోలి
ప్రణయ దేవత నీవనుచు పరువాల సాక్షిగా
బాసలాడినవన్ని ఊసులేనా…
పది మందిలో నేను ఒకదానినైనాన..
నీ ధ్యాస వలదంటు మందలించిన గాని
వినకుండె నా మాట నీదైన నా మనసు … ..
ఎన్ని రేలని నీ కొరకు ఎదురు చూసేది
.మోసగాడా మరి రాకు…మరలి రాకు
విసిగి పోతిని నేను వేసారి పోతి.
.మాధవా రమ్మని మరి నేను పిలువను ….
మాయగాడా మరి రాకు వెడలి పొమ్ము…..విజయ గోలి