బానిసత్వం విజయ గోలి
అణిచి వేస్తున్న కొద్దీ ..
లావా లా పొంగుతున్న ఉద్వేగం ..
ఏమి చేయ లేని చేతగాని తనం ..
అగ్ని పర్వతం పై నీళ్లు చల్లి ..
ఆత్మ వంచన చేసుకుంటుంది ..
భావావేశమే .. బ్రద్దలైపోతుంటే ..
అనుభవమెలా ..అణగారిపోతుంది ..
స్వాతంత్ర్య భారతంలో …
బానిసత్వపు వేరు బలంగానే వుంది …
చిగురాకులు ఎదగకుండా ..
ముల్లులతో ..చిల్లులు పొడిచేస్తూ ..
పేదరికమా…నీకు మరణమే లేదు ..
పౌరసత్వపు పట్టా వున్నంతకాలం ..
ఆధిపత్యమా ..నీ అర్హతేమిటి .
తాతలు తాగిన నేతులా…
వారసత్వపు నీతులా ..విజయ గోలి.