శుభోదయం 🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి
దారిమరిచి బాటసారి ఊరిలోకి వచ్చినాడు
కూటికొరకు గూటికొరకు గువ్వలాగ వెతికినాడు
పగలంతా శూన్యంగా రేయంతా దైన్యంగా
ఒంటరిగా రేలుపవలు ఒక్కటిగా గడిపినాడు
బ్రతుకుబాట సాగేందుకు ఆశలేదు ఏనాటికి
మరణించగ కారణాలు గతమంతా తవ్వినాడు
పరుగులెత్తు రహదారులు ఆగిపోగ చూడలేదు
తరాలెన్నో ఆదారుల తరలిపోగ చూసినాడు
తడిఆరిన కన్నులలో కడగండ్లే దాచినాడు
బహుదూరపు బాటసారి బంధాలకై వగచినాడు