శీర్షిక-:బంధం రచన-:విజయ గోలి
మరుక్షణము బ్రతుకేమిటొ
తెలియని ఒక కల కద
మనిషిమించు అభిజాత్యము
మానసాన నీకేల..
మనసులోని చీకటికి
వెలుగేమిటో తెలుపవేల
బంధాలతొ కలిసినదే
బ్రతుకన్నది తెలియవేల
కష్టనష్ట సముదాయమే
కడలిలోన అలలుకద
స్వార్ధముంటే సంసారమే
ఇమడలేని ఇరుకు కద
బంధాలతొ బలిమున్నది
కోరుకోని కలిమున్నది
అనురాగపు పందిరిలో
ఇలమరిచే హాయున్నది
విస్తరిస్తే మదిగోడలు
ప్రతి బంధము లేనిదే
ఊరి చివర ఉత్తరాన
నీవు నేను ఒకటే కద