గజల్ విజయ గోలి
- గున్నమావి గుబురులలో కోయిలమ్మ పాడుతుంది
పల్లవించు చిగురులనే రాగాలుగ చాటుతుంది - వేపపూల నెత్తావులే వెదజల్లగ వనమంతా
ప్లవ నామపు ఉగాదికి స్వాగతాలు చెప్పుతుంది - విరితావుల పిలుపులలో సుమవల్లరి అల్లరులే
వేడుకగా వాసంతిక వర్ణములే జల్లుతుంది - చెదిరిపోని ఆశయాల చెరుకుతీపి ఆహ్వానమె
నిదురించే నిన్నలకే మేలుకొలుపు పలుకుతుంది - షడ్రుచులా సరాగాల సరిగమలే సంబరంగ
సరిక్రొత్త కోరికలతో విజయాలే అడుగుతుంది