ప్రేమంటే విశ్వానికి

శుభోదయం 🌹🌹🌹🌹🌹
మిత్రులందరికీ “ప్రేమికుల దినోత్సవ “ శుభాకాంక్షలు🌹🌹🌹🌹🌹

ప్రేమంటే విశ్వానికి ఇరుసు
బంధాలతొ బంధించే గొలుసు
సృష్టిలోన ప్రేమంటే …
చెలిమి నింపు మనసు

ప్రణయమొకటె ప్రేమంటే …
ప్రణవంలో దాగున్న
పరమార్ధం మాటేమిటి?
మనిషి మనిషి మధ్యన
మమతల వంతెన పేరేమిటి?

అణువు అణువు నిండివుంది
భగవంతుని అమర ప్రేమ
జననాలకు మరణాలకు
సూత్రమైన సూక్షము
ఆస్వాదన అమృతం
ఆదరణే అసలైన అమ్మప్రేమ !

క్షణికమైన సుఖాలకు
ప్రేమంటూ పేరు పెట్టి
ఆకర్షణ అగ్నిలోన
ఆహుతయ్యే ..యువత
ఇరుకు ఇరుకు ఆలోచన ..
వీడకుంటే భవిత లేదు

పరిమళాల జల్లులలో
పరవశించు ప్రేమతత్వం
విశ్వ ప్రేమ తెలుసుకుంటే …
విలువలతో జీవితమే
విరబూసిన పూల వనం

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language