ప్రేమ విజయ గోలి
ప్రేమ సత్యమైతే విశ్వమంత స్నేహ పరిమళాలు నింపుతుంది
ప్రేమ నిత్యమైతే ఆనందం హరివిల్లై అంబరాన విరుస్తుంది
ప్రేమ మంత్రమైతే మానవత్వం మల్లెపూవై విరపూస్తుంది
ప్రేమ వంతెనైతే మంచి మనసుల జతచేసి మాలలల్లుతుంది
ప్రేమ మధురమైతే శత్రుత్వం విరితేనెల తీపి పంచుతుంది
ప్రేమించి ..ప్రేమ ..పంచు..ప్రతిరోజూ ..ప్రేమికుల దినమై జీవించు .