<<<<< ప్రళయ ఘోష >>>>>విజయ గోలి
కాలాన్ని మింగేస్తున్న సరి క్రొత్త కృష్ణ బిలంలా…
పుడమి పైని స్వచ్చతని చుట్టేస్తున్న కాలుష్యపు సునామి ..
మత్తుమందుకి బానిసైన ఉన్మత్తుడిలా ..
ప్లాస్టిక్ కి చుట్టమై చట్టాలని నెట్టేస్తున్నాం ..
నడుస్తుంది ముళ్ళదారని తెలుసు..
రక్తమోడుతున్న శరీరానికి రంగులద్దుకుంటున్నాము ..
రావణ కాష్టంలా మండుతున్న కల్తీల కార్చిచ్చును
కన్నీళ్లతో చల్లార్చే ప్రయత్నాలు …ఎంతవరకు ..
ఎటు చూసినా ఎండమావులే..ఏడాదంతా ఎండాకాలమే …
జీవన పోరాటంలో ఉనికినే కోల్పోతున్న ..ప్రాణికోటి ..
నీతి నియమం మంటకలిసి ,మానవత్వం మసకబారింది ..
దానవత్వపు దాష్టికం లో ధరణి దద్దరిల్లి పోతుంది
అంధుని కలలాగా భావి అసహజంగా ..అడుగులేస్తోంది ..
దారి తెలియక ..దాగుడుమూతలాడేస్తుంది.. ..
విశ్వంలొ విషవలయపు వింత సృష్టి ..వినాశకాలే విపరీత బుద్ధి
ప్రళయ ఘోష ముందు ప్రణవనాదం చిన్నపోతుంది ..
విజయ గోలి
Sent from my Galaxy