ప్రయాణం …విజయ గోలి
ఎక్కడో ఒక తొలి కేక
మరెక్కడో ఒక ఆఖరి కేక
బంధాలు త్రెంచుకుంటున్న ..
ఆత్మల ఆఖరి కేకలు..
నూతన చైతన్యాన్ని నింపుతూ ఒకటి ..
దేహాన్ని అచేతన పరుస్తూ ..మరొకటి..
నిరంతర పయనంలో ..నిర్ణీత మజిలీలలో ..
కర్మల బరువును మోస్తూ ..
సందిగ్ధపు సమాధి స్థితిలో
సమతుల్యాన్ని వెతుకుంటూ…
మరో మాయా లోకంలోకి ..
మనుగడ మొదలెడుతూ ..