ప్రపంచ ప్రమదావనం లో పరిమళిస్తున్న ప్రతి నారీ సుమానికి
అంతర్జాతీయ మహిళాదినోత్సవ శుభాకాంక్షలు 💐💐💐💐💐
ఓ ప్రమదా…
ప్రపంచాన ప్రజ్వలించే దీపానికి ప్రతీకవు…
సృష్టి లోన సాటిలేని మేటి సృజనవు ..
ఏ ఖండమందైన ప్రతి నాతి చరిత ఒకే రీతి.
తల్లివైన,చెల్లివైన ,కోడలైనా ,కూతురైనా ,
అత్తవైన ,వదినవైన..బ్రతుకు తోడు భార్యవైన ..
వావి వరుసలు ఏమైనా అందమైన విరుల మాలలోన ..
బంధాలను…బంధించిన ..అనురాగ బంధానివి
.
సహనాన ధరణిగా..సాహసాన సమవర్తినే గెలిచావు..
ఆర్తుల పాలిటి అమ్మవు ,ధూర్తుల పాలిటి దుర్గవు …
దారిలోని ముళ్ళన్నీ…మెట్టు మెట్టుగా మలిచావు ..
అపహాస్యపు నవ్వులపై అలవోకగా నెగ్గావు ..
అందదన్న అందలాన్ని అవలీలగా ఎక్కావు..
సంకుచితపు సంకెళ్లు త్రుంచి ..స్వాతంత్ర్యపు శంఖు నూది..
సహగమనపు..చితులనార్పి..సాధికారతా సమరాన నిలిచావు
నిక్కమిక నీ గెలుపు….నీకివే మా నీరాజనాలు.
నింగికెగిసిన నీ బావుటా …అంబరాన్ని అధిగమించి ..
ఆచంద్రతారార్కమూ వెలుగులు విరచిమ్ముతూ..
భావి మహిళకు ఆదర్శమై బంగారు బాటలే చూపాలి 💐💐💐💐💐💐💐💐💐………విజయ గోలి 💐💐💐💐💐💐💐💐💐e