ప్రతిసృష్టి …….విజయ గోలి
జీవకణాలతో సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్న
అపర విశ్వామిత్రులారా !
మూలకణాల తో మృత్యువుకు అడ్డుకట్ట వేస్తున్న
మహా ధన్వంతరులారా !
ముందుగా మానవత్వం పెంచే మందు కనిపెట్టండి
లేకుంటే మీ ప్రతిసృష్టి కి అర్ధమే లేదు .విజయ గోలి
దేశం లో దొంగలు పడ్డారు ..
దొంగలు, దొంగలు వూళ్ళు పంచుకున్నారు …
బిచ్చగాడి బొచ్చెలో గచ్చకాయ వేశారు .
విజయ గోలి .
అమ్మతనం నీదంటూ.. కమ్మగా…
బంధాలతో ..బంధించి…వేశారు ..
ఎన్నటికీ వీడని ..సంకెళ్లు …
విజయ గోలి .
అడుగడుగున లక్ష్మణరేఖలు …
అవి దాటితే తప్పని అగ్నిపరీక్షలు
రాజ్యాలేలినా..రాళ్లుకొట్టినా..
తప్పని అతివ అంతరంగమధనం ..విజయ గోలి .
రచన-:విజయ గోలి
*పచ్చదనానికి రక్ష కడదాం*
పంచభూతాల సాక్షిగా ..పచ్చదనానికి రక్ష కడదాం..
తరువులు పెంచగ తరుణమిదియే..
పర్యావరణమే క్షీరసాగర మధనమాయెను..
విషంగ్రక్కుతు ..కాలుష్యం కరాళనృత్యమే చేస్తుంది.
కరుణతో గరళాన్ని .. గళమున దాచగ శివుడు రాడు.
మోహినియై అమృతాన్ని ..ముదమున పంచగ హరి లేడు.
పుడమి తల్లి కాపాడగ అన్నీ నీవై ..గొడుగు పట్టి అడుగు వేయి
పచ్చదనానికి పందిరి నీవైతే…నీ ఆయువుకు వాయువు తానే!