మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు🙏🏻🙏🏻🌹🌹🌺🌺🌸🌸💐💐
ప్రణతి ప్రణతి ప్రధమ పూజ్య
అవిఘ్నమస్తు అనుచు ఆహ్వానమయ్య
కడగండ్లు బాపి కరుణించుమయ్య
ఉండ్రాళ్ళు నీకు నైవేద్యమయ్య
కానికాలమిది కావుమయ్య గౌరినందయ్య
తొండము ఏకదంతము
బుజ్జిబొజ్జపై నాగబంధము
మందహాసముల.. సుందర రూపా
మందగమనముల.. మూషిక వాహన
కోరిన విందులు చేయలేము గణపయ్య
చీడపీడల అవని చిరాకునున్నది
పత్రి పూజలు పరమావధిగ …
వేదికల వేడుకలు చేయలేమయ్య
చిత్తమున నిను నింపి కోరి కొలిచేమయ్య
కొండంత దేవుడవు కొండంత మనసుతో
కొమ్ముకాయగ రావయ్య కోటిదండాలయ్య
నిరతము చవితిగ నిన్ను కొలిచేమయ్య
ఉన్నంతలో నీసేవ భాగ్యమీవయ్య
అలక పూనక మమ్మాదరించయ్య..
వేయి శుభముల మమ్ము దీవించు మయ్య
విఘ్నముల బాపగా వినతి చేసేమయ్య విఘ్నరాజ! విజయ గోలి