శుభోదయం 🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి
పూవూ తావిగ రేపో మాపో కలిసే పోదాం
విరిసిన సుమాల దారుల లోనా నడిచే పోదాం
కొమ్మల పైనా కోయిల పాటల విందుల సందడి
ఎగిరే రెక్కల జతలే మనమై ఎగిసే పోదాం
నింగీ నేలా సందిట సాగర సంధ్యలు మెరవగ
సరాగ రాగం సంగమ స్వరాలు కలిపే పోదాం
జిలిబిలి నవ్వుల తారల తళుకులు దోచెను నిద్రలు
వేకువ ఝాముల వెన్నెల యేరుల మునిగే పోదాం
ఊహల ఊటల మూటలు ఆశల అలజడి మోసెను
తొలకరి మబ్బుల తొలితొలి చినుకుల తడిచే పోదాం
ఎదురే చూడని వేళల ఎదుటే జాబిలి నిలవగ
వేణువు మీటిన నందన వనముగ మురిసే పోదాం
వీచిన గాలుల పరిమళ గంధం వ్రాసెను గ్రంధం
కాలం చెరపని కావ్యము చెలిమిగ లిఖించె (వ్రాసే)పోదాం