పూలతెప్ప

గజల్. నీకోసమే. విజయ గోలి

వెలుగుదారి సెలయేరుల జారుతుంది నీకోసమే
పూలతెప్ప యేటిపైన తేలుతుంది నీకోసమే

సంపెంగల సందడిలో మారుతమే మత్తుగుంది
చిత్తరాల ఉత్తరాలు పంపుతుంది నీకోసమే

నీలిమబ్బు తెరలనడుమ ప్రణయాల పరిణయమే
పారిజాత పూవులనే జల్లుతుంది నీకోసమే .

పరిమళాల పన్నీరులే చిరుజల్లుగ కురుస్తోంది
పెదవులపై తేనెలతడి నవ్వుతుంది నీకోసమే

మురళిపాట మురిపాలను మీటుతుంది మధురముగా
నీడలలో నీలాంబరి పాడుతుంది నీకోసమే..

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language