శ్రీ మల్లినాధ సూరి కళాపీఠం ఏడుపాయల
శ్రీ అమరకుల దృశ్యకవి గారి ఆధ్వర్యం
సప్తవర్ణాల సింగిడి 2/12/20
అంశం-: కార్తీక మాసోత్సవం..పిఠాపురం శ్రీ పురుహూతికా దేవి
నిర్వహణ -: కవివర్యులు శ్రీ బి వెంకట కవి గారు
పూజ్యులు శ్రీ వెలిదె ప్రసాద శర్మ గారు
రచన-: విజయ గోలి
ప్రక్రియ –వచన కవిత
దశమ శక్తి పీఠం ..పీఠ్యాయాం పురుహూతికా దేవి
శ్రీ సతి పీఠమే శ్రీ పీఠమై విలసిల్ల
ఆదిశక్తియే పురుహూతికా దేవియైవెలిసి
పరమపావనియై పాలించు భక్తుల
ధర్మపీఠముగ పిఠాపురము ధరణి నిలిచె.
కరుణచూపు తల్లి కమలాక్షి
మందారవల్లియై మహిమ చూపు
కుక్కుటేశ్వరునికి కులసతిగ
కొలువుండి తల్లిగ కోరికలు తీర్చేను
గయుని సంహారమొనరించ
గయుని దేహమే యజ్ఞపీఠిక చేసి
త్రిమూర్తులు యాగము చేయ
పూర్ణాహుతి కిముందుగా
పరమశివుడు కుక్కుటమై కూసి
కదిలిన గయుని అంతమొందించి
పాదగయగ పావనత్వము నిచ్చి
పితృకార్యముల పిండదానముల
కాశీకి సమముగ పుణ్యపురమాయె
కోనేరు తీరుగ కుక్కుటేశ్వర లింగమై
కొలువాయె స్వామి కొలిచిన వారి కోరికలు తీర్చ
శ్రీ పాదవల్లభుడు .అనఘా దేవి తోడుగా
శ్రీ దత్త క్షేత్రుడై ఎనలేని..దయచూపు .