విజయ గోలి గజల్
పుచ్చపూల వెన్నెలతో జగమెంతో మనోహరం
పూలతోడి పులకించిన వనమెంతో మనోహరం
పాలపిట్ట ఈలపాట అలలబాట ఆమనియే
పడవలోని పడుచుజంట పాటలెంతొ మనోహరం
ఎదురీతల పులసలతో ఏటివాలు అద్భుతమే
ఒడిదుడుకుల చూడగాను ఊహలెంతొ మనోహరం
నవ్వులన్ని నలువైపుల జల్లుతుంటె ఆహ్లాదం
నడకలలో మానవతా అడుగులెంతొ మనోహరం
అపురూపం మనుజజన్మ విలువలతో విరపూస్తే
వికసించే పరిమళాల* విజయమెంతొ మనోహరం