గజల్.. విజయ గోలి
పిలిచినీకు పిల్లనిస్తే వొల్లవంట ఎందుకంట
అలిగినీవు చేసేవట అల్లరంట ఎందుకంట
మంచెమీద వడిసెతిప్పు వాటమెరిగి వున్నదిలే
కంచెమీద కాపలాలు కాస్తవంట ఎందుకంట
రంగురాళ్ళ మధ్యలోన రతనమేదొ తెలియకుండె
రాలుగాయి సేయితాలు మానవంట ఎందుకంట
అక్కరలో చక్కెరగా ఆదుకుంటె అత్తమామ
కన్నోళ్ళదె కడుపుమంట కానవంట ఎందుకంట
కడుపుచూసి అమ్మపెడితె కలకాలం ఆలికదా
కావడిలో కుండలుండ మరల వంట ఎందుకంట