శుభోదయం🌹🌹🌹🌹🌹
గజల్. విజయగోలి
పరుగులెత్తు కాలానికి పగ్గాలే వేయలేను
తిరిగిరాని క్షణాలకై ఎదురుచూపు ఆపలేను
నీకదలిక మెలికేమిటొ తెలియరాదు పరమాత్మా
నినుమించిన కోరికలే వరమీయగ అడగలేను
ప్రేమలనే పెన్నిధిగా నుదుటిరాత రాయలేవ..
ఆ నవ్వుల నజరానా కనుమూయగ మరువలేను
కడదాకా తోడునిలుచు తలపులతో కాలిపోదు
నడిమిలోన చెదిరిపోవు కలలాగా మిగలలేను
కాలాన్నే ఓడించే కావ్యంగా నిలిచిపోదు
కన్నీళ్ళను కానుకగా దోసిళ్ళతొ తాగలేను