పరుగులెత్తు కాలం

శుభోదయం🌹🌹🌹🌹🌹
గజల్. విజయగోలి

పరుగులెత్తు కాలానికి పగ్గమేసి పట్టలేను
తిరిగిరాని క్షణాలకై ఎదురుచూపు ఆపలేను

నీకదలిక మెలికేమిటొ తెలియరాదు పరమాత్మా
నినుమించిన కోరికలే వరమీయగ అడగలేను

ప్రేమలనే పెన్నిధిగా నుదుటిరాత రాయలేవ..
ఆ నవ్వుల నజరానా కనుమూయగ మరువలేను

కడదాకా తోడునిలుచు తలపులతో కాలిపోదు
నడిమిలోన చెదిరిపోవు కలలాగా మిగలలేను

కాలాన్నే ఓడించే కావ్యంగా నిలిచిపోదు
కన్నీళ్ళను కానుకగా దోసిళ్ళతొ తాగలేను

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language