శుభోదయం 🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి
పరిధిలోన పంచుకుంటె పరిమళించు మానవతే
పరముదాటి పాటుపడితె పరిఢవిల్లు మాధవతే
మాటరాని జీవిదెపుడు తిండికొరకె పోరాటం
కలిమి కొరకు కడవరకూ ఆరాటం మనుషులదే
మనుజుడిగా నీ పుట్టుక గొప్పదిగా మట్టిమీద
మనసులోన మాధవుడే కొలువుంటే గోపురమే
దమనకాండ దారిద్ర్యం అడవి నీతి మృగాలది
కర్మలనే కాల్చివేయు కార్చిచ్చుల హవనమే
అంతిమం గ నీయాత్రలొ అడుగులెలా సాగిననూ
అవనిమీద విజయమంటే అంబరాన ధృవతారే