పరబ్రహ్మం విజయ గోలి
చిత్తమందు చిద్విలాసం చిత్రమేగ పరబ్రహ్మం
ఆదిదేవు నిర్గుణత్వ నియంత్రణా సౌధమేగ
నిశ్చలత్వం నిర్విరామ సాధనేగ పరబ్రహ్మం
దేవదేవుని స్థితిగతులా జతిశబ్థం ఓంకారం
సర్వభూత సమస్థితిగ హితమేగా పరబ్రహ్మం
ఆర్తిజన ఆదరణలో సేదతీరు సాధుతనం
సద్గుణాల ఆచరణల “విజయ “మేగ పరబ్రహ్మం