శుభోదయం 🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి.
ఒక్క మనసు గెలవలేని మనిషెందుకు నేస్తమా!
మదిని విప్పి చెప్పలేని మాటెందుకు నేస్తమా!
మాన్పలేని గాయాలకు మందేకద మరుపంటె
కాలంతో కరగి పోవు కలతెందుకు నేస్తమా!
అందమైన హరివిల్లుపై వెండిమబ్బు దొంగాట
రెప్పవిప్పి చూడలేని కనులెందుకు నేస్తమా!
అనుభవాల మాలలేగ అల్లుకున్న జీవితం
పువ్వులొదిలి ముళ్ళదారి నడకెందుకు నేస్తమా!
మమతలన్నీ మనసులోకి వొంపిచూడు *విజయము లే…
విరగపూయు బ్రతుకుబాట వెతలెందుకు నేస్తమా!