నేను* విజయ గోలి
మబ్బు పట్టిన ప్రతిసారి
జడివానలు కురవాలని లేదు
ఎదురు చూసిన ప్రతి సారీ
ఎడద వెల్లువవ్వాలని లేదు
నిరాశలు నిస్పృహలు. నిర్జీవంకాదు
స్పందనలెపుడు సౌకర్యం కాదు
వడగాడ్పులతో వలపుజల్లులుంటాయి
ఎండమావులలో ఎదురీతలు వుంటాయి
భావాలతో మనసెపుడు మమేకమే
ఒక్కోసారి ఉషోదయాన్ని ఉరి వేసుకోమంటాను
అమావస్య లో ఆవిరై పోవాలని
ఒక్కోసారి తొలికిరణపు వెలుగు కొరకు
నడిరేయి నుండే నిరీక్షిస్తాను
వెలుగు వేడుకలో వొదిగి పోవాలని
నీకు నాకు మధ్య నిలబడ్డ… నేను
నిశీధిలో నింగి ఎత్తు నిశబ్దం
ఏ మనాదులకు తలొంచదు
మనం దరికి రావటానికి
అడుగులు తడబడుతాయి
వయసులు గియసులు ఏమి ఉండవు
మనసు యోగంలో ..తడవాలంతే..