శుభోదయం 🌹🌹🌹🌹🌹
గజల్ విజయ గోలి
నీ పేరున జీవితమే కానుకగా ఇస్తున్నా
నా నుదుట నీ ప్రేమను ఇష్టంగా వ్రాస్తున్నా
వలచివలచి వచ్చానని వలపుదాచి ఆడబోకు
నిలిచి చూడు నీ వెనుకే అడుగువేసి వస్తున్నా
ఎదచప్పుడు నీ పిలుపై సలుపుతుంది తలపులలో
మధువులనే నింపుకుంటు మాలతినై పూస్తున్నా
ఆగడాల జగడాలనె సాగదీసి తూచబోకు
కొలతలనే సరిచేయగ పూమాలగ వేచున్నా
పంతమొదిలి పూబంతిని చేరలేవ చెలువమీర
పడమటింట పంచదార పలుకుకొరకు చూస్తున్నా!!