శుభోదయం 🌹🌹🌹🌹🌹
గజల్ విజయ గోలి
నీలాల గగనాల హరివిల్లు మెరిసేను
పుడమికే పులకలుగ తొలిజల్లు కురిసేను
ఎదురొచ్చి ఏరువాక ఆశలే నాటింది
రైతన్న కనులలో దివ్వెలై వెలిగేను
తూరుపున వెలుగులే తుళ్ళిపడె జల్లులతొ
పడమరతొ పరిచయం పరవళ్ళు తొణికేను
వాగులే ఒంపులలో వయ్యారం ఒలికేను
తూనీగ ఆటలతొ తుళ్ళింత సాగేను
నెలమూడు వానలుగ వరమిస్తే విజయాలె
రామయ్య రాజ్యమై నవ్వులే విరిసేను