aవిజయ గోలి గజల్
జ్ఞాపకాల పుటలలోన నెమలీకే నాచెలియ
అగరుపూల నెత్తావుల సౌగంధికే నాచెలియ
చినుకులలో చిందేసిన చిన్నతనం తానుగా
జేగంటల సవ్వడిలో సుహాసినే నాచెలియ
వసంతాల వేడుకలో ఇంద్రధనుసు వన్నెలుగ
మల్లెపూల మడుగులలో సౌవర్ణికే నా చెలియ
తళుకుమనే తారలలో జాబిల్లిగ మెరవగా
కలువపూల రేకులపై నీహారికే నాచెలియ
మనసంతా మందిరమే మనసైన దేవతకు
సరిజోడుగ నాతోడున మాళవికే నాచెలియ