*నాగది… విజయ గోలి..
పగలు కూడ చీకటేల
నిండిపోయే నాగదిలో
వెలుగెందుకు వెరపుతోడ
నిలిచిపోయె వాకిటిలో
అలసిసొలసిన బాటసారి
సేదతీరగ ఆగినాడేమో
తలపుల మూట తలగడగా
తడుముకుంటూ నిదురపోయె
వెలుగురేఖలు విచ్చకుండా
వేకువనే వెడలిపోవులే..
వెళ్లకుంటే వెనుకాడక
వెలుపలకే నెట్టివేతురు
ఎవరెవరో నీడలుగా
కదిలినాయి నాగదిలో
గోడపైన నాచిత్రం
సాక్ష్యంగా చూస్తుంది..
చిత్రంగా ..దొంగెవడో
దూరినాడు నాగదిలో
ఎరుకలేదు ఇన్నాళ్ళు
నా గదిలో మరొక గది ఉందని
నా గదిలో చోటు ఇక లేదని…