చెల్లెమ్మా అంటూ ఎంతో ఆప్యాయంగా పిలిచే ఆత్మీయ సోదరుడు ప్రసాదరావు రామాయణం గారు నా కవితా సంపుటి నాకల -నా స్వర్గం పై వారి అభిప్రాయం వ్రాసారు. మీ స్పందన కోరుతూ
విజయ గోలి
నా కల-నా స్వర్గం
రచన:శ్రీమతి విజయ గోలి సోదరి
ఒక అభిప్రాయం
విజయ గోలి అనగానే ఆమె గజళ్ళు నర్తిస్తాయి మన మనసులో.పిల్లనగ్రోవి నూదుతాయి వీనుల్లో విందుగా…
విభిన్నమైన వస్తువులతో,ఆమె 69 వచన కవితలు వ్రాయడం విశిష్టతను పొందు పరచుకుంది.అలతి పదాలతో,భాషార్భాటం లేకుండా,అసందర్భ అలంకారాలు లేకుండా,ప్రాస పదాల కోసం ప్రయాస పడకుండా , అర్జనుని బాణంలా సూటిగా పాఠకుని మనసులో గుచ్చుకుంటాయి ఆమె భావాలు. ఎంత హాయో ! ప్రాస రదీఫ్ లు, కాఫీయాలు వ్రాసేవారికి ప్రాసలకు కొరవేముంది?కానీ ఆమె భావానికే ప్రాధాన్యత ఇచ్చారు
ఆమే చెప్పుకున్నట్టుగా దేవులపల్లి వారు ఇష్టమని, కొన్ని కవితలలో శాస్త్రి గారు కనిపిస్తారు. విశిష్టమైన భావుకతతో నింపేస్తుంది.పాఠకులను చంపేస్తుంది ఆభావనలలో ముంచి.
నేను ఆమె కవితలను ఏమీ కోట్ చెయ్యడం లేదు.ఏ కవితకు ఆకవితే అతి శ్రేష్టమైనవి.కనుక పాఠకులకే వదిలేస్తున్నాను.బాలూ, సిరివెన్నెలల అకాల మరణం పై ఆమె వ్రాసిన కవితలు కంట తడి చేశాయి
కవితలంటే ఇష్టపడే వారూ, ఇష్టపడని వారు కూడా తప్పక చదువవలసిన పుస్తకం
సోదరీ విజయ గారికి నా అభినందనలు
ప్రసాదరావు రామాయణం