శుభోదయం🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి
ఆత్మీయ స్నేహితులైన నాన్న లందరికీ….
అంతర్జాతీయ పితృదినోత్సవ శుభాకాంక్షలు 💐💐💐💐💐
నాన్నంటే …నాలుగు రాటలు తానై నిలిచిన నీడేగా
కొండపైన కోవెల దేవుడు అండగ నిలిపిన తోడేగా
తరువులోని త్యాగం సతతము చూపే తాపసి తానేగా
తప్పటడుగు తరుణం తానొక రక్షణ శిక్షణ గురువేగా
కనుపాపలు తనవే కాని ఆ కలల రాజ్యము పిల్లలదే
ఇంద్రధనువు ఊయల నెక్కగ నిచ్చెన మోసిన మూపేగా
కలత దాచి కన్నుల …వెలుగుల వేడుక పంచిన వేదికగా
భుజంతట్టి బుద్ధిగ ఎదిగే మెలుకువ తెలిపిన చెలిమేగా
మీ నడతే …విజయపు కానుక నడకలు నేర్పిన నాన్నలకే
ఈ ఘనతే నీదన … గర్వం మెరిసిన ముసి ముసి నవ్వేగా