నవ్వు. విజయ గోలి
నవ్వు కు ప్రతి నవ్వు
పువ్వు లాంటి కానుక
మనసు తీర మల్లెలా
నవ్వ గలగటమే మహిలో
మనిషికి మహా యోగం
ఎన్నో సమస్యలకు
అసలైన పరిష్కారం
మౌనాన్ని మైనంలా
కరిగించేది లాస్యం
ఆదమరిపించే
అమ్మ చిరునవ్వుకు
సాటి దీపమెక్కడ
గుడిలో రూపం
గర్తుకు తెచ్చే
పసిపాప నవ్వుకు
ప్రతిస్పందించని
మనసే ఉండదు
కల్మషంలేని నవ్వు
కరిగిస్తాయి కర్పూరంలా
కరకు గుండెలు సైతం
మువ్వలాంటి నవ్వులెపుడు
రవళిస్తాయి మురళిలా
పకపకనవ్వే పడచు
నవ్వుకు స్పందించని
పరువం ఉంటుందా..
స్వచ్ఛంగా నవ్వలేని
బతుకులో అగుపించు
అనారోగ్యపు అతుకు
మనాదులపై ముసుగేసి
ముఖంపై నవ్వులు
బలవంతంగా పూయించినా
గడ్డిపూవులల్లే..
గుడ్డితనం వదలదు.
నవ్వుల పువ్వుల్ని
కర్కశంగ నలిపేసె
నరకాసురులతో
నడక తెలిసి మెలగాలి
నవ్వు కు స్వేఛ్చనివ్వు
నవ్వుల తాళం నమ్మి
ఇవ్వకు ఎవరికి మరి
నవ్వే లేకుండా చేస్తారు
పంచదార నవ్వులనే
పదిమందికి పంచు
కాజేయకు నవ్వుల కలిమిని
కాటేయకు చిరునవ్వుల చెలిమిని
నవ్వంటే నారాయణ నామం