గజల్ విజయ గోలి
నీనవ్వులొ మువ్వలేవొ రాలినట్లుఉన్నదిలే
పలుకులలో తేనెలేవొ ఒలికినట్లు ఉన్నదిలే
చూపులలో సూదంటుల గాలమేదొ దాగున్నది
చిలిపితనం చిలకలన్ని కులికినట్లు ఉన్నదిలే
వొంపుసొంపు వొదిగిపోయె వసంతమే నీవుగా
నడకలలో నదులేవో కదిలినట్లు ఉన్నదిలే
నాణెమైన నాప్రేమను నైవేద్యం పెడుతున్నా
కరుణించిన దేవతయే వచ్చినట్లు ఉన్నదిలే
పూవుతావి సంబరంగ సరిజోడుగ మనబంధం
విరపూసిన నాగమల్లి నవ్వినట్లుఉన్నదిలే