నవరాత్రులు

మల్లినాధ సూరి కళాపీఠం

*అష్ట దుర్గలు    విజయ గోలి

అమ్మా జననీ అఖిలం నీవె
నీరూపమె అపురూపము ..
సృష్టి స్థితి లయ కారిణి నీవె
శైలపుత్రిగ వెలిసిన సతివి

అంబా శాంభవి సర్వం నీవె
సకలాభీష్ట దాయినివే
సర్వకళామయ సంస్కృతి నీవై
బ్రహ్మచారిణిగ నిలిచిన ధాత్రివి

రాగద్వేషముల రాజీవము
సర్వవ్యాధి సంహరణము
సర్వధర్మ సంస్కరణము
చంద్రఘంట నీవైన చరితము

జనన మరణముల జాగృతి నీవె
జయాపజయాల స్పురణవు నీవె
మార్గము చూపే దీపము నీవె
కూష్మాండవై వెలిగిన జ్యోతివి

ఆదిదేవుని అర్ధభాగినివి
సత్య కర్మ సంధాయనివి
సూర్య చంద్రాగ్నిలోచనవి
స్కందమాతవై వెలిగిన గౌరివి

హరిహర ఇంద్రాదుల ఆగమ దైవం
ఐశ్వర్యాధిష్టాను దేవత నీవు
సర్వకామ ఫలప్రదాయని నీవు
కాత్యాయనిగా కాచిన దేవివి

అష్టదిక్కుల పాలిక నీవె
అఖిలాండ కోటి బ్రహ్మాండనాయిక
భక్తాభీష్ట ఫలప్రదాయిక
కాళరాత్రిగ కావలినీవె..

జనపూజిత జననివి
జ్ఞానహితవు జాహ్నవి నీవు
జయకారముల విజేతవునీవు
సిద్ధధాత్రిగ స్ధిరమున నీవె

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language