దేవుడికో విన్నపం

దేవుడికో విన్నపం   విజయ గోలి

అంతు పట్టని అద్భుతాలతో
అనంత విశ్వాన్ని సృష్టించావు ,
అందమైన ప్రకృతి ని సృష్టించావు
మాట రాని పశు పక్ష్యాదులను సృష్టించావు,
చిన్న చేపను మ్రింగే పెద్ద చేపను సృష్టించావు.

మాటలాడే మనిషిని ప్రత్యేకంగా సృష్టించావు
మంచి చెడు విశ్లేషించే జ్ఞానాన్ని ఇచ్చ్చావు ,
ఒక మనిషిని కరిగి పోయే మానవత్వపు కొండగా ,
ఒక మనిషిని కరడు గట్టిన కసాయి బండగా సృష్టించావు,

ఏమిటి నీ సృష్టి లోని అంతరం ?
బంగారు పూలు కోరే వాడివి ,
గడ్డిపూలను ఎందుకు సృజియించావు ?
నీ సృష్టిలోని అవక తవక లెంచే ఉన్మాదిని కాను ….

నీ సృజనలోని చెడు విస్తరించి
మంచి మరుగున పడుతుంది ,
ప్రళయ విస్ఫోటనం కనుల ముందు కనబడుతుంది ,
మళ్ళీ సృష్టి మొదలెడితే ,మాదొక విన్నపం
చెడును విస్మరించి మంచిని మాత్రమే సృష్టించు
లేదంటే మనుష్యుల సృష్టిని మరిచిపో దేవుడా !

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language