20/8/2020
గజల్ విజయ గోలి
కనులుమూసి కలగంటే కాలమాగి పోదుకదా
గీసుకున్న గీతలతో రాతమారి పోదుకదా
పూవుతావి స్నేహంలో తుమ్మెదలె కమ్ముతుంటె
చేసుకున్న బాసలకే చేతమారి పోదుకదా
సహనంతొ సరిహద్దులు ఎంచకుంటె మేలుకదా
అడుగడుగున అన్యోన్యత జాడమారి పోదుకదా
రాచబాట హంగులెపుడు పొంగిపోవు రంగులేను
రాచరికం తెలుసుకుంటె దారిమారి పోదుకదా
సరదాలే సంకెళ్ళుగ సాగుతున్న విజయంలో
గుచ్చుకునే విరిముళ్ళతొ ప్రాణమాగి పోదుకదా