సాహితీ మిత్రులందరికీ * రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు 🌹🌹🌹🌹🌹
గజల్ విజయ గోలి
తోటొకటే పాటొకటే ఆటాడిన గూడొకటే
అమ్మ నాన్న చేయిపట్టి నడిచినట్టి బాటొకటే
అమ్మపేగు బంధంగా తోడునీడ నువ్వు నేను
దైవమిచ్చు వరమంటే తోబుట్టువు తోడొకటే
మనుషులెంత దూరమైన మనసులెపుడు చేరువలే
మమతలతో చిగురులేసి అల్లుకున్న తీగొకటే
పుట్టినింటి మమకారం పుట్టెడంట అమ్మాయికి
కోరేనులె కన్నఇంటి దీపావళి వెలుగొకటే
రక్ష కట్టి భారమైన బహుమతులు అడుగదులే
పసిడిపూల అక్షింతల ఆశీస్సుల ధ్యాసొకటే
అన్నగాను అనుబంధం అనుక్షణం కాచమంటు…
తమ్ముడివై తలపులలో నిలపమనే ఆశొకటే
ఆత్మీయత అనురాగం కలనేతల పట్టుచీర ..
కానుకివ్వు …ఆడపడుచు కనుల వెలుగు ప్రేమొకటే