తొలి గురువుగా జీవితాన శ్రీకారం అమ్మే కదా
తొలిసారిగా ప్రేమ రుచిని చవి చూపిన దేవతేగా
తప్పటడుగు సరి చేసే గొప్పతనం అమ్మదేగా
ఎనలేని ప్రేమని కొలత లేక పంచటం అమ్మకేగా సాధ్యం
బ్రహ్మ బదులు అమ్మైతే ,అమ్మ బదులు పదమే లేదు .vijaya goli
క్రొత్త నీటి వలసల తో పాత నదుల తుళ్లింత…
వచ్చే నాటికీ వలసకూడా అంతర్లీనం ..
పాత క్రొత్తలు ,క్రొత్త పాతలు కొన్నాళ్లే ..
అంతఃకరణల ..అనుభవాలే …
మలినాల ..వడపోతలు ..
వడపోతలే వసివాడని జ్ఞాపకాలు ..విజయ గోలి
నాగరికత వృక్షానికి ఆధునికతా తెగులు పుట్టింది
తెలుగు నుచ్చరించలేని తెగులు… మా తెలుగు తల్లికి మల్లెపూదండ …విద్యాలయాల్లోనే వింతపోకడలొచ్చాయి …
చూపులు కలిసిన శుభ ఘడియలు
మనసు తెలిపిన వలపు బాసలు
గెలిచిన ప్రేమల ఆశల ఊసులు ..vijaya goli