శుభోదయం🌹🌹🌹🌹🌹
సాహితీ మిత్రులందరికీ తెలుగుభాషా దినోత్సవ శుభాకాంక్షలు
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి
తొలిపొద్దున వెలుగురేఖ అందమైన తెలుగుభాష
తేనెఊట తేటగీతి మధురమైన తెలుగుభాష
గాలిలోన గమకాలతొ గంధాలను చిలుకరించు
ఎలకోయిల స్వరములోన రాగమైన తెలుగుభాష
మాటలోన పాటలోన మమతలన్ని రంగరించు
గుమ్మపాల తీపిమించి కమ్మనైన తెలుగుభాష
గోదావరి గలగలలో కృష్ణవేణి పరుగులలో
యాసబాస జతులుకలిపి ఏకమైన తెలుగుభాష
దిగంతాల ఏలుతున్న భువనవిజయ కేతనమే
దేశమాత ముక్కెరలో ముత్యమైన తెలుగుభాష