గజల్ విజయ గోలి
తీపితీపి మాటలతో పోటులేల చెలికాడా
కనిపించని గాయాలకు మందులేల చెలికాడా
ప్రేమంటే అలలపైన వెన్నెలనీ అనుకోకులె
నిప్పునైన వేరుకాని జీవమేగ చెలికాడా
వెలుగులిచ్చు దీపానికి వెలలుకట్టు లోకములో
శలభంగా కాలిపోవు బతుకులేగ చెలికాడా
సెలయేరుగ తలచినాను పెను కడలిగ మారినావు
తీరాలను చేరలేని తీరులేల చెలికాడా
స్వాగతించు మనసెపుడూ స్వచ్ఛమైతె విజయమేగ
అవనిపైన ఆనందపు యోగమేగ చెలికాడా