గజల్ విజయ గోలి
తీపి గురుతు ఇచ్చావుగ వీడలేని బంధముగా
మరలమరల చదువుకోను మరువలేని గ్రంధముగా
నన్నునేను మలుచుకునే నమ్మకాలు వీగిపోయె
నీవులేని నిజాలనే నమ్మలేని చందముగా
అందమైన నాతోటను ఆమనులే వీడాయిలె
బీడైనది మోడులతో మానలేని గాయముగా
ఎడారిలో వదిలినావు దప్పికార కన్నీటినె
కానుకగా పంచావుగ తీరలేని దాహముగా
అలసిపోతి ఆదమరువ ఎద తలగడ కోరితినీ
మిణుగురునై నినుచేరుదు ఆశలేని అందముగా