గజల్. విజయగోలి
తళుకులీను తారలేల చందమామ అందాలే నీవైతే
వేలవేల వన్నెలేల పాలపుంత చందాలే నీవైతే
నందనాన నవ్వుతున్న విరిబాలల సొగసులతో నాకేలా
ప్రణయాన మదిమీటిన వేణుగాన రాగాలే నీవైతే
తరులనూపి తుంటరిగా తిరుగులాడు తెమ్మెరతో పనియేల
మన్మధుని రాకతెలుపు మధరమైన మారుతాలె నీవైతే
నవ్వులతో ప్రేమలలో ప్రాణమిడిచి పోవాలని ఉన్నదిలే
తీరమెంక చూపులేల నేమునిగిన సాగరాలె నీవైతే
క్షణాలతొ యుగాలతో విరహాలా వివాదాలు నాకేలా
ఎదలయలో ఒదిగిపోయి ఒక్కటైన విజయా లే నీవైతే