మల్లినాధ సూరి కళాపీఠం
* జీవుడు విజయ గోలి
భ్రమలందు భ్రమరమై
తిరిగాడు జీవుడు
దరి తెలియు సమయానికే
తనువు ధగ్ధమైపోవు
పుట్టిగిట్టుట యందే
పొర్లాడు చున్నాడు జీవి
శివము తెలియక తాను
జీవచ్ఛవమై తిరుగాడు
తత్వమరసిన గాని
తనువు బంధము తెలియు
ఇహలోక బంధాల
ఇరుసు చట్రములోన
కూరుకుని ఉన్నాడు
కూటమి తెలియక
దేహమందలి దేవళం
ఎరుకైన వానికి
భృకుటి నిలచిన నేత్రం
బుద్ది తెలిపేను
అహము ఆవిరికాగ
ఆనంద సిద్దికలగేను