శుభోదయం 🌹🌹🌹🌹🌹
గజల్ విజయ గోలి
రేపన్నది ఎవరికెరుక హరివిల్లున రంగులేగ జీవితం
అనుభవించు నేటిరోజు దీపావళి పండుగేగ జీవితం
మృత్యువంటె భయమేల తప్పకోను దారిలేని సత్యమే
ఒడిదుడుకుల వాగులన్నీ ఓరిమితో దాటుటేగ జీవితం
అందరాని చందమామ ఆశతీర అందుకునే తీరాలి
అందలేక కుంగిపోతె అగాధాల అంచులేగ జీవితం
ఎరుకలేని వెరుపెందుకు చెరగనీకు పెదవులపై చిరునవ్వు
బెదిరి పోక నిలబడితే ఎదురులేని గెలుపులేగ జీవితం
నలుగురితో పంచుకునే నడతలుంటె నడకంతా పూదారి
పోయినాక బ్రతికుంటే లోకంలో విజయమేగ జీవితం