గజల్ విజయ గోలి
కన్నతల్లి గొప్పదనం తరిగిపోదు ఏనాటికి.
జన్మభూమి ఋణమన్నది తీరిపోదు ఏనాటికి.
శాంతిపధం సమరములో సాధించిన స్వాతంత్ర్యం
త్యాగనిరతి జ్యోతులేవి ఆరిపోవు ఏనాటికి.
ఎగురుతుంది ఎర్రకోటపై త్రివర్ణా ల భారతం
ధర్మచక్రపు నీలివన్నె మాసిపోదు ఏనాటికి.
వినువీధిన రెపరెపలే విశ్వమంత నింపుతుంది
ఎలుగెత్తిన విజయగీతి ఆగిపోదు ఏనాటికి
వేదమాత నాదేశం సిరివరాల కదంబమే
యుగయుగాల విజ్ఞానం వాడిపోదు ఏనాటికి
వంచలేదు శిరసెక్కడ దించబోదు మరిఎక్కడ
వెనుతిరగని ధీరత్వం ఓడిపోదు ఏనాటికి
నరనరాన గర్వమేగ నాదైనది హిమశిఖరం
భరతమాత బిడ్డగానె నిలిచిపోదు ఏనాటికి