మల్లినాధ సూరి కళాపీఠం
*చేయూత విజయ గోలి
బ్రహ్మ విష్ణువు శివుడు
ఒకరికొకరు చేయూత
లేనిదెసృష్టి లేదను
మాట విదితమే
మానవత్వపు మనుగడ
మరిచినాడు మనిషినేడు
స్వార్ధ చింతన సాధకుడై
సమాజాన్ని చెరచినాడు
అడవిలోని జీవులన్నీ
ఆదమరచి నిదురబోవును
వెలుగునీడల వెరచి
బ్రతుకు మనిషి ఎపుడు
ఎండవానకు గొడుగుగా
ఎదుగువానికి వెన్నుతట్టు
చేయి చేయి కలసికట్టు
అడుగుఅడుగున అభివృద్ధిలో
ఐకమత్యపు ఆనకట్టలు
ధన్యత చెందగ జీవితం
దారులే వేరు వేరు
మంచితనమున మనుగడే
జీవితపు సార్ధకత
పుట్టిగిట్టుట కాదు ..జన్మ
గిట్టినా బ్రతుకున్నదే అసలు జన్మ
నట్టేటి నావలో ప్రయాణం
ఆదిఅంతాలు లేని ఆత్మ ప్రయాణం
మూడునాళ్ళ ముచ్చటేగ జీవితం
అడుగడుగున అంతర్ముఖ దర్శనం
అత్యుత్తమ అంశల ఆవిష్కారమే
తనను మించిన తత్వమే తాత్వికత
అవనితో వియోగం
ఆకశాన సంకేతం
భువనభోంతరాలలో మరుజన్మ
సత్యం శివం సుందరాలతొ తాదాత్మ్యం