మిత్రులందరికీ ..అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ ..
శుభాకాంక్షలు 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*చెలిమి కలిమి* విజయ గోలి
స్నేహమంటే నవ్వులు
పరిమళాలు ..వెదజల్లే..
పారిజాత పువ్వులు..
చిన్ననాటి చిలిపితనపు…
జ్ఞాపకాల గుబాళింపు..
తలపులలో తలవగనే …
తలుపు తట్టి ..పిలిచేదే స్నేహం
వయసు వలపు సరిగమలో
రహస్యాలు దాచుకున్న…
తొలి ప్రేమల ఖజానాలు
తనువులెంత ..దూరమైన
మనసులంత ..దగ్గరగా
నిలిచేదే …అసలైన స్నేహం
నవ్వు వెనుక నీడలలో
ఓదార్పుల వెన్నెల ..
కలతలోన ….కన్నీరై..
కాచునట్టి కలిమి కదా చెలిమి
ఒడి దుడుకుల వేళలో
వెన్ను తట్టి నిలిచేదే… స్నేహం
పరిధి లేని స్నేహానికి ..
గిరిని గీసి ..స్నేహాల..పండగంటే …
నవ్వుతుంది..నా స్నేహం
కలిమిలెన్ని …ఉన్నా…
చెలిమి కలిమి …లేని నాడు జీవనమే….శూన్యం…
బ్రతుకంతా …పండుగగా…ఉండాలోయ్….ఒక నేస్తం..