రచన-:విజయ గోలి గజల్
చెట్టుచూసి పుట్టచూసి చెదిరిపోకు నీకునీవు
ఏటిలోన నీటిలోన మునిగిపోకు నీకునీవు
ఎండనైన వానయైన పక్షితీరు మారబోదు
గాలివాటు గమనంలో తేలిపోకు నీకునీవు
చీమంటూ దోమంటూ తేలికగా తీసేయకు
కళ్ళుమూసి ముళ్ళలోకి జారిపోకు నీకునీవు
కొండపైన దేవుడైన చూపేదే బ్రతుకుబాట
భారమంత నీదేనని సోలిపోకు నీకునీవు
తరచిచూసి అనుసరిస్తె విశ్వమందు విజయ మేగ
పొలమారును అధికుడిగా ఎంచుకోకు నీకునీవు