విజయ గోలి చుక్క పూల వెలుగు
పగటివెలుగు దాటుకుంటు
వచ్చివాలెను సందెపొద్దులు
అడుగులోన అడుగువేస్తూ
జాబిలొచ్చెను రేరాజునంటూ
మౌనమేల నా ప్రాణమా
మనసుతీరగ నవ్వలేవా
వలపు దుప్పటి కప్పలేవా
వయసు జోరును ఆపలేవా
చుక్కపూలు తళుకుమంటూ
వెలుగు నింపుకు విచ్చుకుంటూ
తెలి మబ్బు తెరలచాటు
కదిలి వచ్చెను ఆటలాడుతు
ఛైత్రమాసం చిలిపిగాలి
వాయులీనం మీటుతుంది
మాటలాడు ప్రియతమా
మౌనమేల వీడవు
చందమామతో ఆకాశం
కలువపూల కొలనుమల్లె
కొలువు తీరి ఉన్నది
రేయంతా వెన్నెలనే
నిలవమంటూ చెప్పలేవా