చిత్రవీణ

చిత్రవీణ

చిత్రవీణ పాడినదీ ఛైత్రవర్ణ రాగాలే!

వనమంతా ఆలపించె వలపు సిరుల గానాలే

ఒకసారీ సరాగమై ఒకసారీ వియోగమై

చందమామ కళల తీరు మనసంతా మంద్రాలే

పొంగి పోవు భావాలతొ ఎదమీటిన తరంగాలు

మొయిలు నీడ మయూరమై ఆడినదీ నాట్యాలే

మరునిమిషం మౌనాలతొ  శృతి చేయని వీణియగా

స్పందించని హృదయంలో సమరంగా శూన్యాలే

పూవుకొక్క పల్లవిగా పరిమళించు రస విపంచి

మధుపముకై మధురంగా మధువు నింపు లాస్యాలే

పలుతీరుల పలుకరించు పలుకలేని పవనాలే

ముకుళించును కలువబోలుమోయలేని విరహాలే

ఇంద్రధనువు రంగులలో  ఇమిడిపోవు చిత్రమదే

రంగుకొక్క రాగమవును విజయ వీణ సుస్వరాలే !!

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language